హుజూరాబాద్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న మూల మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. కరీంనగర్ నుండి వరంగల్ వైపు వస్తున్న వాహనాలు మూల మలుపు వద్ద బోల్తా పడి కాలేజ్ లో దూసుకెళ్లిన సంఘటనలు గతంలో జరుగాయ్ తాజాగా భోపాల్ నుండి రాజమండ్రి వెళుతున్న లారి జూనియర్ కాలేజ్ మూలమలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం బోల్తా పడడం తో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇప్పటికైన అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు పెట్టీ ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.