బిఆర్ఎస్ నాయకులు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి హనుమకొండ చౌరస్తా వరకు బైక్స్ పై ర్యాలీగా వచ్చి హనుమకొండ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులకు మరియు బిఆర్ఎస్ నాయకులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది.