ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనను వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్ ఛలో తక్కెళ్లపాడుకు పిలుపునిచ్చారు. తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం యాదవుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. అలాగే హిందువులందరూ కూడా కృష్ణుడిని పూజిస్తారని అలాంటి విగ్రహావిష్కరణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు. కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీసీ సంఘాలు, యాదవ సంఘాలు, తరలిరావాలని కోరారు.