బాపట్ల రూరల్ గ్రామాల్లో ఏసిటీ కేబుళ్లను కట్ చేస్తున్న బిసిటీ సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించినా, ఫిర్యాదు నమోదు చేయకుండా నిందితులను వదిలేశారని ఏసిటీ కేబుల్ ఆపరేటర్లు శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల అండతో బిసిటీ సిబ్బంది అరాచకాలు చేస్తున్నా పోలీసులు వారి వైపే మొగ్గు చూపుతున్నారని, నిందితులను వదిలేయడం సరికాదని ఏసిటీ కేబుల్ ఆపరేటర్లు ఆరోపించారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.