దారి దోపిడీకి పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నాగోల్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. శుక్రవారం సాయంత్రం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17న రమేష్ అనే వ్యక్తి రాత్రి పది గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు రమేష్ ను బెదిరించి అతని వద్ద సెల్ ఫోన్, పర్సును లాక్కొని పారిపోయారని తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.