బిఆర్ఎస్ పార్టీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కామెంట్స్ చేశారు.. ఏలూరులో పర్యటించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనాలి సందర్భంగా బిజెపి కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని,కుటుంబమే పరవాదిగా పనిచేసే పార్టీలు తాత్కాలికమేనని అన్నారు.. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన బి ఆర్ ఎస్ కల్వకుంట్ల అస్తిత్వంగా మారిందని,తెలంగాణలో బిఆర్ఎస్ పూర్తిగా దగాకోరు పార్టీగా మారిందని విమర్శించారు..తెలంగాణను పూర్తిగా దోసుకున్న బిఆర్ఎస్ ఆ పార్టీకి చెందిన కవితను సస్పెండ్ చేసిందని దోచుకున్న డబ్బు పంపకాల విషయంలో కుటుంబంలో తగాదాలు ఏర్పడ్డాయి అన్నారు.