మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం పోలీస్ స్టేషన్లను శుక్రవారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో చుట్టూ పరిసర ప్రాంతాలను రిసెప్షన్ రికార్డులను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా సంబంధిత విపిఓలు గ్రామాలకు వెళ్లి ఎన్ని మండపాలు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. గ్రామాలలో ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించాలని తెలిపారు.