గోదావరి నది తీర ప్రాంతంలో నిమజ్జన ఘాట్‌ల వద్ద లాంచీలు బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. నదీ తీర ప్రాంతంలో ఎటువంటి అపశృతి జరగకుండా విస్తృత భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ భక్తులకు, గణేశ మండపాల నిర్వాహకులకు ముఖ్య సూచనలు చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపులో భక్తులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, పెద్ద సంఖ్యలో గుంపులు ఏర్పడి అల్లర్లు చేయకుండా శాంతియుతంగా ఊరేగింపులు నిర్వహించాలన్నారు