కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల పోలీస్ స్టేషన్ లో గణేష్ ఉత్సవాల కమిటీల సభ్యులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించినట్లు మండల ఎస్ ఐ సాయి కృష్ణ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ హాజరై గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన తో మొదలుకొని నిమజ్జనం చేసేవరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కరెంటు ఉప పరికరాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అలాగే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.