అద్దంకి పట్టణంలోని రాజీవ్ నగర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు రాంగ్ రూట్ లో వస్తున్న మరొక కారును తప్పించబోయి ఎదురుగా ఉన్న కరెంటు పోల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు సురక్షితంగా ఇలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. అయితే కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.