శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం సబ్ డివిజన్ పరిధిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. హిందూపురం పట్టణంలో జరిగే నేరాలపై సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు మర్డర్లు రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి మహేష్ సిఐలు రాజగోపాల్ నాయుడు జనార్ధన్ అబ్దుల్ కరీం లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.