ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని గుర్తించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆటో డ్రైవర్ ను సన్మానించినట్లు గురువారం తెలిపారు. ఓ మహిళ గత ఆదివారం రోజున కరీంనగర్ లో రాజేందర్ ఆటోలో ప్రయాణించి, బ్యాగును మరిచిపోయింది. మర్చిపోయిన బ్యాగును మహిళ దిగిన స్థలానికి వెళ్లి సురక్షితంగా బ్యాగును అందించారు. తమ బంధువులు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకువచ్చి తాకట్టు పెట్టి వైద్యం చేపిద్దామని వచ్చినట్లు ఆ మహిళ తెలిపింది.ఈ ఘటన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలుసుకొని తిమ్మాపూర్ మండలం పోలంపల్లి కి చెందిన ఆటో డ్రైవర్ రాజేందర్ ను సన్మానించారు.