బాపట్ల జిల్లా నూతన కలెక్టర్‌గా శనివారం డా. వాసుదేవ వినోద్ కుమార్ పదవీబాధ్యతలు స్వీకరించారు.ఇంచార్జి జేసీ గంగాధర్ గౌడ్,కలెక్టరేట్ ఏవో మల్లి కార్జునరావు వేద మంత్రోచ్ఛారణల మధ్య కలెక్టర్ వినోద్ కుమార్‌కు ఘన స్వాగతం పలికారు.జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా జిల్లా అధికారులు కలిశారు. కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడానికి కృషి చేస్తానని, జిల్లా అభివృద్ధికి పాటుపడతానని కొత్త కలెక్టర్ మీడియా కు తెలిపారు.జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.