భీమవరంలో డయాలసిస్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పొందే సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉన్నతాధికాలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. శుక్రవారం భీమవరం పరిసర ప్రాంతాల నుంచి నరసయ్య అగ్రహారంలోని కేంద్ర మంత్రి నివాసానికి పెద్దసంఖ్యలో వచ్చిన డయాలసిస్ పేషెంట్లు వారి బంధువులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను కలిసి ఆరోగ్యశ్రీ సేవలను వర్మ హాస్పిటల్ లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.