సింగరేణి సంస్థలు ప్రభుత్వ జోక్యం మితిమీరి పోయిందని సంస్థకు చెల్లించాల్సిన 40,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి సింగరేణి మనుగడను కాపాడాలని మందమరి ఏరియా హెచ్ఎంఎస్ డిమాండ్ చేసింది. మందమర్రి హెచ్ ఎం ఎస్ కార్యాలయంలో బుదవారం సాయంత్రం 4గంటలకి ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థకు 40 వేల కోట్లు బకాయిలు రావాలని ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే కొత్త గనులు వచ్చే అవకాశం ఉందని అప్పుడే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో పూర్తిగా రాజకీయ జోక్యం పెరిగిందని అన్నారు