నడిగూడెం మండలం కాగితా రామచంద్రపురం గ్రామంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. తమ పంటలకు కీలకమైన యూరియాను ప్రభుత్వం వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.