మట్టి విగ్రహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేద్దామని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలతోనే పండగ జరుపుకోవాలన్నారు. కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.