అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నటువంటి పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని మన్యం జిల్లా బిసి సంక్షేమ అధికారి ఎస్.కృష్ణారావు అన్నారు. శుక్రవారం మద్యాహ్నం కురుపాంలో గల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో స్టాకు వివరాలు, పిల్లలు, గర్భిణీలు, బాలింతరాలు రికార్డులను పరిశీలించి అంగన్వాడీ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు.