దీపావళి పండుగ సందర్భంగా ఇంద్రవెల్లి మండలం వాల్గొండ హీరాపూర్ లో జరుగుతున్న గుస్సాడి, దండారీ సంబరాల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు.గుస్సాడీలు ధరించే నెమలి ఈకల టోపీలు ఇతర సామాగ్రితోపాటు ఏత్మాసూర్ దేవుడికి కుటుంబ సుగుణక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ ఈ ఉత్సవాల నిర్వహణకు ఆర్థికసాయం పెంచేలా ప్రభుత్వాన్ని కోరతామన్నారు.రాయి సెంటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అభి వృద్ధి చేస్తుందని,ఆదివాసీ గూడేల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు కృషి చేస్తానని అన్నారు.