వేటపాలెం మండలం రామన్నపేట లో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట స్థావరంపై ఎస్సై జనార్ధన్ ఆదివారం మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుండి 2600 రూపాయల నగదును స్వాధీనపర్చుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.డ్రోన్ సాయంతో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టామని, నిరంతరం దాడులు చేస్తామని ఆయన వెల్లడించారు