సారధ్యం యాత్రలో భాగంగా సెప్టెంబర్ 2న భీమవరం వస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటనను ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శిలు కలిదిండి వినోద్ వర్మ కోరారు. భీమవరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం బిజెపి నాయకులు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు నాయకులు భీమవరం వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ తెలిపారు. సుమారు 5వేల మంది సారధ్యం యాత్రలో పాల్గొంటారు అని అన్నారు.