వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 545 పోలియో బూత్ల ద్వారా 87,938 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశామని, 93% శాతంగా నమోదైందని జిల్లా వైద్యాధికారి పాల్వాన్ కుమార్ తెలిపారు. మరో 2 రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది గృహ సందర్శన చేసి పోలియో చుక్కలు వేసుకోకుండా ఉన్న వారికి వేస్తారన్నారు. చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలన్నారు.