సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ మంత్రి పొన్నం ప్రభాకర్ చేశారు. వన మహోత్సవంలో భాగంగా గ్రామస్తులకు మంత్రి మొక్కలు అందించారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటెలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా గ్రామంలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ అందించారు. అనంతరం గొల్లకుంట గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్