మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం హనుమద్దాసు మండపంలో శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ నేతృత్వంలో అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరాజు, పాలకమండలి సభ్యులు, అలివేలమ్మ, పలువురు దంపతులు పాల్గొన్నారు.