రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు ఛైర్మన్ వలవల బాజ్జీ అన్నారు. గురువారం పెంటపాడు మండలం కోరుమిల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ పటిష్ఠంగా ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం గర్వకారణమన్నారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.