రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీచేసే 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలలో ఎక్కడా కాపులకు ప్రాతినిధ్యం లేకపోవటం పట్ల గురువారం సాయంత్రం కాపు సంక్షేమ సేవా సంఘ వ్యవస్థాపక అద్యక్షులు పులి శ్రీరాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఏలూరులోని కాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో పులి శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులలో కాపు కులానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు