అనంతపురంలో సూపర్ సిక్స్ సభ విజయవంతం అయిందని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం MVP కాలనీ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు 90 శాతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమలు పరిచారని అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు