కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వర్ణయుగ శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ ఆలయంలో ఆదివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),కామారెడ్డి రక్తదాతల సమూహం,రెడ్ క్రాస్ సొసైటీ ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ లు తెలియజేయడం జరిగింది. డాక్టర్ బాలు,ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,18 సంవత్సరాల నుండి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.