నిజామాబాద్ కమిషనర్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరిగాయి. ఈ మేరకు నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలోని, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, పరిధిలో 6000 విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. సాంప్రదాయ బద్ధంగా 9, 11 రోజులపాటు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జనా కార్యక్రమాలు చేశారు. కుల మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు ముగియడంతో, ప్రతి ఒక్కరికి సిపి కృతజ్ఞతలు తెలిపారు.