అశ్వారావుపేట ఖమ్మం జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఖమ్మం వైపునుండి అశ్వారావుపేట వైపు వస్తున్న ఐరన్ రాడ్స్ ట్రాలీ లారీ నారంవారిగూడెం వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో గూడ్స్ లారీ ని బలంగా ఢీకొని ట్రాలీలో ఐరన్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. రెండు లారీల్లో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లకి తీవ్రగాయాలయ్యాయి.ట్రాలీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో పోలీసులు స్థానికులు బయటకి తీసి,గాయపడ్డ రెండు లారీల డ్రైవర్లను అంబులెన్స్ లో అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.