రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన 2025 మెగా డీఎస్సీలో పామిడి మండలానికి చెందిన ఏడు మంది వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటిలుగా ఉద్యోగాన్ని పొందారు. అందులో పామిడి మండలం వంకరాజు కాల్వ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు నరసింహ, సురేష్ చంద్ర వ్యాయామ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం విశేషం. పామిడికి చెందిన వెంకటేష్, మహేష్, హనుమేష్, పామిడి మండలం తంబళ్లపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు, ఎదురూరు గ్రామానికి చెందిన హస్సెన్ వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మహేష్ ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ఎంతో ఇష్టమైన వ్యాయామ వృత్తిపట్ల మక్కువతో సాధించారు.