కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఘోష్ కమీషన్ ఇచ్చిన రిపోర్టును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధిపేట పట్టణ పరిధిలోని రంగథాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుండి కాళేశ్వరం జలాలు తీసుకువచ్చి రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద జలాభిషేకం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో హైదరాబాద్- కరీంగనర్ రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భ