కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ను బద్నాం చేయాలని చూస్తోందని వేములవాడ BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే,ఉద్యమ నేత నిమ్మశెట్టి విజయ్ అన్నారు.మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..వేములవాడ నియోకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు నీరు వచ్చిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని, సీఎం కేసీఆర్ పేరును రూపుమాపాలనే ఆలోచనలతో కాలేశ్వరంపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వానికి వ్యక్తిరేకంగా నినాదాలు చేశారు.