రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపడానికి వెళుతున్న సిపిఐ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తారా? యూరియా తెప్పించలేని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ను రైతులు నిలదీయాలని, రైతులంటే బిజెపికి ఎందుకంత అలుసని, రైతులంతా ఏకమైతే బిజెపి మంత్రులను,ఎంపీలను ఎక్కడ కూడా తిరగకుండా తరిమి కొడతారని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు కరీంనగర్ లోని బిజెపి ఎంపి బండి సంజయ్ ఆఫీస్ ను ముట్టడించారు. రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు రోడ్డెక్కుతున్నారని, యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేంద్ర మంత్రులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.