ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయ సన్నిధిలో స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆలయ అర్చకులు నిత్యార్చన, నిత్యహోమాలు, దిగ్దేవతా బలిహరణ, ద్రవిడవేద పారాయణం, నీరాజనం, మంత్ర పుష్పాలు, విష్వక్సేన పూజ, అష్టదిక్పాలక ఆరాధన, సదస్యం, చతుర్వేద పండితులచే మహదాశీర్వచనం, వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పాల్గొన్నారు.