మార్గదర్శులు, బంగారు కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. నేటికీ జిల్లాలో 352 సచివాలయాలకు గాను 329 సచివాలయాలు కవర్ అయ్యాయని, అందులో 16,050 కుటుంబాలకు సంబంధించి 1,24,557 మందికి P4 కింద దత్తత చేసుకోవడం జరిగిందన్నారు. డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు మండలాల్లో పురోగతి బాగాలేదని, వేగవంతం చేయాలన్నారు.