అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అతి పురాతన గుత్తి కోటను సోమవారం గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు సందర్శించారు. గుత్తి కోటకు వచ్చిన వారిని గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చౌదరి విజయభాస్కర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ట్రక్కింగ్ చేస్తూ గుత్తి కోటను ఎక్కారు. గండికోట అడ్వెంచర్ సభ్యులు కోటను పరిశీలించి పర్యాటకంగా అభివృధి చేసేందుకు ఓ నివేదిక తయారుచేసి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకు నివేదిక ఇవ్వనున్నారు. గుత్తి కోట అద్భుతంగా ఉందని వారు కితాబు ఇచ్చారు