సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య అనారోగ్యంతో మృతి చెందిన మండల కార్యదర్శి నాగరాజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ చెన్నై కొత్తపల్లి సిపిఐ మండల కార్యదర్శి నాగరాజు మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగిందని ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నాగరాజుకు నివాళులర్పించి భవిష్యత్తులో నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య పేర్కొన్నారు .