జిల్లాలో టిక్‌టాక్ వీడియో వివాదంపై ఎస్పీ వివరణ ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో హిందూ దేవతలను దూషించేలా ప్రచారం అవుతున్న వీడియో తాజాగా తయారుచేయబడింది కాదు. ఆ వీడియో 2022లోనే పులివెందులకు చెందిన ఉస్మాన్ ఖాన్ తయారు చేసినదని, ఆ సమయంలోనే ఆయన క్షమాపణ చెప్పినట్లు గుర్తుచేశారు.ఉస్మాన్ ఖాన్ 2022లో కువైట్ వెళ్లి పాస్‌పోర్ట్ సమస్యల కారణంగా 20 రోజులపాటు జైలులో ఉన్నాడు. అక్కడ ఏపీకి చెందిన కొందరితో టిక్‌టాక్ ద్వారా పరిచయం ఏర్పడి, వారితో విభేదాల కారణంగా 1.45 నిమిషాల వీడియో చేశాడు.ఇటీవల ఉస్మాన్ స్వగ్రామమైన పులివెందులకు తిరిగి వచ్చాడు.