శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 43 కేసుల్లో, రెండేళ్లలో స్వాధీనం చేసుకున్న 1,197 మద్యం బాటిళ్లు, 186 లీటర్ల నాటు సారాను పోలీసులు గురువారం సాయంత్రం ధ్వంసం చేశారు. ఎక్సైజ్, పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో వీటిని డంపింగ్ యార్డ్ వద్ద ట్రాక్టర్ తో తొక్కించి ధ్వంసం చేసినట్లు CI ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ AES రాముడు, CI మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది రఘునాథుడు, బాలకృష్ణ, నాను నాయక్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.