అల్లూరి జిల్లా పెదబయలు మండలం తారాబు గ్రామం నుండి అనారోగ్యం పాలైన గిరిజన మహిళను గ్రామస్తులు తమ భుజాలపై మోసుకుంటూ వాగు దాటించి ముంచంగిపుట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అతి కష్టం మీద తరలించారు. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అక్కడి సమస్యను వీడియో తీసి వాట్సాప్ ద్వారా పాడేరు మీడియాకు చేరవేశారు. గ్రామంలో అనారోగ్యంతో పరిస్థితి విషమించిన మహిళను గ్రామస్తుల అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారిపై కొండ వాగు ఉధృతంగా పొంగి ప్రహరించడంతో అంబులెన్స్ రాని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాన్ని వారు ఆశ్రయించారు.