పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ కోరారు. సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటిముందు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. విద్యార్థులు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.