కూలీ డబ్బులకోసం ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందిన ఘటన నేరడిగొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శేఖర్, వెంకటేష్ కూలి డబ్బుల కోసం గురువారం గొడవపడ్డారు. శేఖర్ మెడలోని తాడును వెంకటేష్ లాగడంతో కింద పడ్డ శేఖర్ కు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు 108లో బోథ్ ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.