రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ సిద్ధివినాయక ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం మూడో రోజు పీత వర్ణంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షం చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తుల నినాదాలతో ఉత్సవ వాతావరణం నెలకొంది.