జమ్మికుంట: పట్టణంలోని వర్తక సంఘం హాల్లో ఆదివారం సాయంత్రం వీణవంక ఇల్లందకుంట జమ్మికుంట మండలాల న్యాయవాదుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జమ్మికుంటలో మున్సబ్ మెజిస్ట్రేట్ కం జూనియర్ సివిల్ జడ్జి కోర్టును నెలకొల్పాలని ఉమ్మడిగా 30 మంది న్యాయవాదుల ఏకాభిప్రాయంతో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ మూడు మండలాలకు సంబంధించి సివిల్ మరియు క్రిమినల్ కేసులు దాదాపుగా 4000 విచారణలో ఉన్నాయని అన్నారు.ఇక్కడి ప్రజల కోరిక మేరకు కోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దీని పై ఆలోచన చేయాలని అన్నారు.