నల్గొండ జిల్లా, నేరేడుగొమ్ము మండలం, పెద్దమునిగల్ గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమునిగల్ గ్రామానికి చెందిన రైతు కేతావత్ చెన్న పొలం దగ్గర గుర్తుతెలియని వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. అడవి పందుల రక్షణ కోసం ఏర్పాటుచేసిన కరెంటు తీగలు తగలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని, స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.