నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండల కేంద్రంలోని దేవరకొండ-నల్గొండ ప్రధాన రహదారిపై రైతులు గురువారం మధ్యాహ్నం బయటాయించి యూరియా సమస్యను పరిష్కరించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాత్రి, పగలు తేడా లేకుండా యూరియా కోసం పడి కాపులు కాసిన యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండల వ్యవసాయ అధికారి వచ్చి సమాధానం చెప్పే వరకు రాస్తారోకో విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. రాస్తారోకోతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.