Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గురించి ఇష్టారీతిన మాట్లాడితే తాట తీస్తామని ముస్లిం మైనారిటీ నేతలు హెచ్చరించారు. కావలి షాదీ మంజిల్లో నాయకులు మాట్లాడారు. ముస్లింలకు అండగా నిలుస్తున్న ఏకైక నాయకుడు కృష్ణారెడ్డే అన్నారు. తమ నాయకుడిపై అబద్ధ ఆరోపణలు మానుకోవాలని హితవుపలికారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.