నాగులుప్పలపాడు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగులుకులపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొరిసపాడు మండలానికి చెందిన శ్రీను అనే వ్యక్తి గత కొంతకాలంగా ఉప్పుగుండూరులో నివాసం ఉంటున్నాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, శ్రీను ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.