కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక యాసులపు సూర్యరావు భవనం నందు, బర్రె గిరిబాబు అధ్యక్షతన మున్సిపాలిటీ కార్మికుల సమస్యలపై విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు క్రాంతి కుమార్, శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ వర్కర్స్ తో, సమావేశం జరిపి వారి సాధక బాధలను వినాలని కోరారు, ఒకటో తారీకు దాటి పది రోజులు అవుతున్న, జీతం ఎప్పటికీ వేయలేదని, తక్షణం కార్మికుల జీతాలను వేయాలని కోరారు, మహిళలకు ఇస్తున్న పుష్ గాడ్ ల పనిలో మరొకరిని అదనంగా కేటాయించాలని కోరారు.